Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆసరా పెన్షన్ల కార్డుల పంపిణీ

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి , జిల్లా చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు .

సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 1 నిజం న్యూస్

సూర్యాపేట పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు చివ్వెంల మండలం పెన్ పహాడ్ మండలం లకు సంబంధించిన నూతనంగా మంజూరు చేసిన *ఆసరా పెన్షన్ల కార్డు లను పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు జిల్లా చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు చేతుల మీదుగా గురువారం పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్ , డి ఆర్ డి ఓ పి డి కిరణ్ కుమార్ ,ఆర్ డి ఓ , జడ్పీ సీఈఓ సురేష్ రెండు మండలాలకు సంబంధించిన జడ్పీటీసీలు , ఎంపీపీలు, అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.