Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆర్.ఎఫ్ సి.ఎల్ దళారుల కేసుల ఎఫ్ఐఆర్ డాటా లేదా ?

ఎఫ్ .ఐ .ఆర్ . పబ్లిక్ డాక్యూమెంట్.. వివరాలు అడిగితే అధికారుల తిరస్కరణ

గోదావరిఖని :ఆగస్టు :30:

నిజం న్యూస్

ఆర్ .ఎఫ్ సి .ఎల్ బాధితుడు హరీష్ తనకు న్యాయం జరగలేదని దళారులు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసారని మనస్తాపంతో ఆత్మ హత్య చేసుకున్నాడు .ఈ క్రమం లో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో హరీష్ ఆత్మహత్య కి కారకులైనటువంటి

చెలక పల్లి సతీష్ , గుండు రాజు,గోపగాని మోహన్ గౌడ్,

బొమ్మగాని తిరుపతి గౌడ్ లపై కేసునమోదు చేశారు . అరెస్ట్ వివరాలు పెద్దపెల్లి డి.సి. పి రూపేష్ కుమార్ వెల్లడించారు .

2021 నుండి ఆర్ .ఎఫ్ .సి .ఎల్ లో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసిన వారిపైన నమోదు చేసిన కేసుల వివరాలు కూడా వెల్లడించారు .ఎన్టీపిసి లో 2022 లో రెండు కేసులు నమోదుకాగా 2021 లో ఒకకేసు నమోదు అయ్యింది . అట్టి కేసు ప్రస్తుతం ట్రయిల్ లో ఉంది .గోదావరిఖని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదుకాగా పెద్దపెల్లి లో ఒకకేసు నమోదు అయ్యింది .

కేసుల కి సంబంధించిన ఎఫ్ ఐ .ఆర్ నమోదు అయ్యినటువంటి కేసుల తేదీల వివరాలని నిజం న్యూస్ ప్రతినిధి సంబంధిత స్టేషన్ ఎస్ .హెచ్.ఓ .లని అడుగగా ఎఫ్ .ఐ .ఆర్ వివరాలు అందుబాటులో లేవనే సమాచారం ఇచ్చారు . పెద్దపల్లి పీఎస్ లో నమోదైన కేసు వివరాలు అడుగగా

ఎస్ .హెచ్.ఓ . గత నెల కేసు నమోదయ్యిందని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని నేరారోపణ మోపబడినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారని నిజం న్యూస్ ప్రతినిధి తెలిపారు . గత నెల కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ పేరిట కాలయాపన చేసిన అధికారులు బాధితులకి బరోసా కల్పించకుండా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాక నిందితులని

అరెస్ట్ చూపారు .సామాన్య ప్రజల మీద కేసులు నమోదవుతే ఉన్నటు వంటి కార్యాచరణ రాజకీయ నేరస్థులు నిందితులు అయితే లేదని ఇన్వెస్టిగేషన్ పేరిట కాలాయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . లక్షల రూపాయలు టోపీ వేసి నిరుద్యోగులని మోసం చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారనే విమర్శలు కూడా ప్రజల నుండి వస్తున్నాయి .

హరీష్ ఆత్మహత్య చేసుకునే దానీకంటే ముందే కేసులు నమోదు అవుతే నిందితులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసు

ఇన్వెస్టిగేషన్ లో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి .

ఇదే విషయమై విషయ సేకరణకు పెద్దపెల్లి డిసిపి రూపేష్ కుమార్ ని ఎఫ్ .ఐ .ఆర్ వివరాలు అడుగగా ఎఫ్ .ఐ .ఆర్ వివరాలు అందుబాటులో లేవని అన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉన్నాయనే వివరణ ఇచ్చారు .

ఎఫ్ .ఐ .ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్ అయినప్పటికీ ఎఫ్ .ఐ .ఆర్ వివరాలు అందుబాటులో లేదని ఎఫ్ .ఐ .ఆర్ అయినా తేదీలని వెల్లడించపోవడానికి గల కారణాలని పోలీస్ అధికారులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది .