కుర్నపల్లి లో ఉప సర్పంచ్ రాముడిని హత్య చేసిన మావోయిస్టులు

చర్ల ఆగస్టు 30 ( నిజం న్యూస్) మండలంలోని సెలమల సిఆర్పిఎఫ్. క్యాంపుకు కూతవేటు దూరంలోఉన్న కుర్న పల్లి పంచాయతీ ఉపసర్పంచ్ ఇర్ఫా రాముడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం కొందరు సాయుధ మావోయిస్టులు రాముడి ఇంటి వద్దకు వచ్చి రాముడుని తీసుకువెళ్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుపడి. కాలు. వేలు. పట్టుకొని బతిమిలాడిన వదిలిపెట్టలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాముడిని దారుణంగా హత్య చేసి మృత దేహాన్ని రహదారి పక్కన పడవేశారు. మృతుని వద్ద లేఖను వదిలి వెళ్లారు. లేఖలో గత కొంతకాలం నుండి పోలీసులకు ఇన్ ఫార్మర్ గా మారి. మా సమాచారాన్ని పోలీసులకు సారవేస్తున్నాడని. టిఆర్ఎస్ పార్టీ నాయకులతో తిరుగుతున్నాడని.ఆ కారణంగానే రాముడుని హత్య చేశామని లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గామారిన ఎవరికైనా ఇదే గతి పడుతుందని లేఖలో హెచ్చరించారు.