యాదాద్రి జిల్లాలో పలువురు తహసిల్దార్లు బదిలీ

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఆగస్ట్ 29 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురు తహశీల్దార్లను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పై బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గుండాల తహశీల్దార్ సి.హెచ్.శ్రీనివాసరాజును నారాయణపూర్ కు,నారాయణపూర్ పి.రవికుమార్ ను కలెక్టరేట్ కు,కలెక్టరేట్ సూపరిండెంట్ జి. దశరథను అడ్డగూడూరు తహశీల్దార్ గా,అడ్డగూడూరు తహశీల్దార్ పి. రామకృష్ణను ఆలేరు తహశీల్దార్ గా,ఆలేరు తహశీల్దార్ డి. గణేష్ ను కలెక్టరేట్ కు మరియు కలెక్టరేట్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించే జి. జ్యోతిని గుండాల తహశీల్దార్ గా బదిలీ చేశారు.