వైద్య శాఖలో ఉద్యోగాల అక్రమాలపై చర్యలు ఏవి

-లేఖశ్రీ ఉద్యోగ వివరాల్లో రహస్యం ఏమిటి ?

-వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి నరాల సత్యనారాయణ డిమాండ్…… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 29 (నిజం న్యూస్)

సమాచారహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న వైద్యశాఖ అధికారులపై రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని నిబంధనలు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి నోటిఫికేషన్,పత్రికా ప్రకటనలు లేకుండా దొడ్డి దారిలో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంచర్ల లేఖశ్రీ ఉద్యోగ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినా స్పందించిన అధికారులు నేడు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ సిఫారసు మేరకు ఉద్యోగం ఇప్పించినట్లు పలు పత్రికలలో వార్తలు వచ్చినప్పటికి జిల్లా,రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించక పోవడంపై పలు అనుమానాలున్నాయన్నారు. అడ్డదారిలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం పొందటం, ఆమె ఉద్యోగ నియామకానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని భుజంగరావు అనే వ్యక్తి సమాచారహక్కు చట్టం ద్వారా కోరగా గడువు దాటినప్పటికి ఇవ్వలేదని,దింతో దరఖాస్తు దారుడు నేరుగా కార్యాలయానికి వెళ్లగా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఆమెకు సంబంధించిన వివరాలు మీకెందుకంటూ కార్యాలయ సిబ్బంది ప్రశ్నించి కంచర్ల లేఖశ్రీ ఉద్యోగ వివరాలు ఇంటికి పంపిస్తామని తిప్పి పంపడం,నేటికీ సమాచారం ఇవ్వకపోవడాన్ని చూస్తుంటే ఆమె ఉద్యోగ నియమకంలో ఏదో తిరికాసు ఉన్నట్లు అర్ధం అవుతుందని, గతంలో జిల్లా సెలక్షన్ కమిటీ తీర్మానం,సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ ఆమోదంతో ఉద్యోగం పొందిన ఒ స్టాఫ్ నర్స్ ను ఏడు నెలలు పని చేయించుకుని జీతం ఇవ్వకుండా తొలగించటంలో ఉన్న అత్యుత్సాహం మిగతా వారిపట్ల ఎందుకు చూపించడం లేదని,ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పలు అవినీతి, అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వస్తున్నాయని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి నోటిఫికేషన్ లేకుండా జిల్లాలో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి వారు ఇప్పటివరకు తీసుకున్న వేతనాన్ని ప్రభుత్వం రికవరీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు.