బీజేపీ పార్టీని ప్రజలు నమ్మరు

తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.
గానుగుబండ లో 65 లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ల పంపిణీ.
దళిత బంధు లబ్ధిదారుడు బొంకురి జలంధర్ కారు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే.
తుంగతుర్తి ఆగస్టు 29 నిజం న్యూస్
దేశంలో ఎక్కడా లేని విధంగా, సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు రుణమాఫీ తో పాటు దళిత బందు పథకం ప్రవేశం పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్. గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
సోమవారం మండల పరిధిలోని గానుగుబండ గ్రామంలో సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి అధ్యక్షతన, నూతనంగా 65 లబ్ధిదారులకు రాజకీయాలకతీతంగా 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గానుగుబండ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు సుమారు ఒక కోటి 80 లక్షల నిధులను మంజూరు చేసి గ్రామానికి కావాల్సిన సిసి రోడ్లు, డ్రైనేజీ, నర్సరీలు, వైకుంఠధామం, గ్రామ పంచాయతీ ట్రాక్టర్, మిషన్ భగీరథ ట్యాంకు లతోపాటు పలు అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో కాలేశ్వరం ద్వారా నీటిని ఎస్సారెస్పీ కవులకు మళ్లించి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలు నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని పంట పొలాలు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి సుమారు 2500 డబుల్ బెడ్ రూములు, మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గాను మన గ్రామానికి పదిమందికి దళిత బందు, పదిమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అవకాశమున్న ప్రతిసారి ముఖ్యమంత్రి కెసిఆర్ నిలబెట్టిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, గుండ గాని రాములు గౌడ్, ఉప సర్పంచ్ పరమేష్, దుర్గయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, చెరుకు సుజనా పరమేష్, తడకమళ్ల రవికుమార్, భాస్కర్, బొంకురి జలంధర్, మధు, మద్దెల మహేష్, క్రాంతి, శ్రీహరి, సర్పంచులు యాకూ నాయక్, వీరు జి, ఎంపీటీసీ ఆంబోతు నరేష్, ఆసరా పింఛన్ లబ్దిదారులు, టిఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు. అనంతరం మన సాక్షి రిపోర్టర్ కొండగడప ఎల్లయ్య పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.