ముఖ్యమంత్రి కెసిఆర్, న్యాయమూర్తి రమణ, ఎమ్మెల్యే, చిత్రపటాలకు జర్నలిస్టులు పాలాభిషేకం

తుంగతుర్తి ఆగస్టు 27 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పై సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న కేసును తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు స్థలాలు మంజూరు చేయాలని, తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయమూర్తి రమణ, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ చిత్రపటాలకు శనివారం రోజు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సెంటర్లో , మండలంలో పనిచేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాలాభిషేకం నిర్వహించారు., అనంతరం తాసిల్దార్ రామ్ ప్రసాద్ కు తాసిల్దార్ కార్యాలయంలో, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్, పూస పెళ్లి యాదగిరి, కొండ గాడు పుల ఎల్లయ్య, ఉమేష్, పోలే పాక రామచంద్రుడు, ఎండి మాజిద్, ఆకారపు ఎల్లయ్య, జలగం అంజయ్య, ఇరుగు సైదులు, సత్యనారాయణ, తడకమళ్ళ రమేష్, భూపతి సైదులు, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్, తదితరులు పాల్గొన్నారు.