రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

చర్ల ఆగస్టు 28( నిజం న్యూస్) మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది కట్టుకూరి రాఘవ అఖిల ఆసుపత్రి సమీపంలో ( 22) రోడ్డు దాటుతున్న క్రమంలో చెన్నుపాటి లారీ ట్రాన్స్పోర్ట్ ఏపీ 16 టి . నెంబరు గల లారీ ఢీకొని సుమారు 30 మీటర్ల దూరం ఈడ్చుకొని పోవటంతో రాఘవ అక్కడికక్కడే మృతి చెందాడు. కట్టుకూరి రాఘవ సొంత గ్రామం మధిర . రాఘవ తండ్రి కట్టుకూరి ప్రిన్స్ మధిర నుండి బదిలీపై వచ్చిచర్ల గ్రామపంచాయతీ లో రెగ్యులర్ అటెండర్ గా విధులు చేపట్టారు. చేతి కంది న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ఈ విషయమై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొనివిచారణ చేసి కేసు నమోదు చేశారు