
దేవాలయ కమిటీ చైర్మన్ గా ముత్యాల వెంకన్న నియామకం పట్ల హర్షం
తుంగతుర్తి ఆగస్టు 26 నిజం న్యూస్
తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు రెండవ మారు తుంగతుర్తి పట్టణ పి పట్టాభి సీతారామ దేవాలయ కమిటీ చైర్మన్ గా ముత్యాల వెంకన్న ని దేవాదాయ శాఖ అధికారులు నియామకం జరిపినట్లు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్ గౌడ్, చెరుకు పరమేష్, సురేందర్రావు, మండల టిఆర్ఎస్ నాయకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.