రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

యాడికి ఆగస్టు 26 (నిజం న్యూస్)
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడురు గ్రామ సమీపంలో తాడిపత్రి నుండి గుత్తి వైపు నల్ల బండలు లోడ్ తో వెళ్తున్నా లారీ, రోడ్డు పక్కన నిలిచి ఉన్నలారీని వెనుక వైపు నుండి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ముందు లారీ లో ఉన్న కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన డ్రైవర్ తలారి అది నారాయణ (35) అక్కడికి అక్కడే మృతి చెందారు.తాడిపత్రి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.