సైబరాబాద్ సీపీఓ లో హెచ్ డి ఫ్ సి ఏటీఎం సేవలు ప్రారంభం

మాదాపూర్, నిజం న్యూస్, (ఆగష్టు 25):
సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ డి ఫ్ సి ఏటీఎం కేంద్రాన్ని సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సిబ్బంది సౌకర్యార్థం హెచ్ డి ఫ్ సి బ్యాంక్ యజమాన్యం ముందుకొచ్చి ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు
హెచ్ డి ఫ్ సి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బద్రి విశాల్ మాట్లాడుతూ… సుమారు 28 ఏళ్లుగా సేవలందిస్తున్న బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తున్న హెచ్ డి ఫ్ సి బ్యాంక్, ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తుందన్నారు. ఈ ఏటీఎం ద్వారా 15 రకాల సేవలను పొందవచ్చన్నారు. నగదు ఉపసంహరణతో పాటు, బిల్లుల చెల్లింపు, పిన్ సెటప్, తక్షణ రుణాలను పొందడం వంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, అడ్మిన్ డిసిపి ఇందిర, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, సీఎస్ డబ్ల్యు ఏడీసిపి వెంకట్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ మట్టయ్య, అడ్మిన్ అర్ఐ అరుణ్ కుమార్, బద్రి విశాల్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్), తాజుద్దీన్ మసూద్ (వైస్ ప్రెసిడెంట్), జోస్ స్టీఫెన్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్), హర్ష చోత్రాణి (బ్రాంచ్ మేనేజర్),
శ్రేయా సోని (రిలేషన్షిప్ మేనేజర్), సత్యనారాయణ కందికొండ (ఉపాధ్యక్షుడు)
తదితరులు పాల్గొన్నారు