జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి

గ్రామీణ జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చాలి.
హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యపై పరిష్కారం పట్ల జర్నలిస్టుల హర్షం.
ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి జగదీష్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం.
సూర్యాపేట ప్రతినిధి ఆగస్ట్ 25 నిజం న్యూస్.
హైద్రాబాద్ నగర జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తీర్పు ఇవ్వడం హర్షణీయమని టెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి జగదీష్ రెడ్డి లకు నా ధన్యవాదాలు చెబుతూ వారి చిత్రపటాలకు గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు.
తెలంగాణ జర్నలిస్టు ఫోరం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉందన్నారు.* నేడు సుప్రీం కోర్టులో జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పు జర్నలిస్టులంతా గర్వించేదన్నారు. *తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో బాధ్యతాయుతంగా పని చేసింది గ్రామీణ జర్నలిస్టులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు గ్రామీణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు.* క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామీణ జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ జర్నలిస్టు ఫోరం కృషి చేస్తుందన్నారు. *హైదరాబాద్ జర్నలిస్టుల సమస్యను పరిష్కరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 జాతీయ కౌన్సిల్ సభ్యులు గుండా శ్రీనివాస్ గుప్తా, జిల్లా అధ్యక్షులు వజ్జ వీరయ్య, పట్టణ ప్రెస్క్లబ్ అధ్యక్షులు గుణగంటి వెంకటేశ్వర్లు, జర్నలిస్టులు రాపర్తి కేశవ్ గౌడ్, చల్లా శేఖర్, పెద్దింటి శ్యాంసుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, వల్దాస్ ప్రవీణ్, తల్లాడ చందన్, తాళ్లపల్లి రాజు, బచ్చు పురుషోత్తం, దేవరగట్ల సతీష్ బ్రహ్మచారి బుక్కా ఉపేందర్ మామిడి శంకర్ వీరన్న నాయక్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.