క్విట్ ఇండియా ఉద్యమంలో ముందు- అభివృద్ధిలో మాత్రం వెనుక.

➡️ *అంధకారంలో పెంటపాడు గ్రామం*
➡️ *పెంటపాడు గ్రామంలో పడకేసిన పారిశుద్ధ్య*
➡️ *అధికారులు నాయకుల మధ్య తారా స్థాయికి చేరిన విభేదాలతో కుంటుపడిన గ్రామ అభివృద్ధి*
పెంటపాడు ఆగస్టు 25(నిజం న్యూస్)
దేశానికి స్వతంత్రం సిద్ధించి ఏడు శతాబ్దాలు దాటినా పెంటపాడు గ్రామంలో అభివృద్ధి మాత్రం శూన్యం పెంటపాడు గ్రామ పంచాయితిలలో ఎటు చూసినా గాని మురుగు కాల్వల నిర్మాణం,డ్రైన్ల పూడిక లేదు,పూర్తి స్థాయిలో సిసి రోడ్లు లేవు,వీధిలైట్లు వెలగవు,వర్షాకాలంలో వచ్చిందంటే గ్రామంలో రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.చినుకు పడితే డ్రైనేజీలు నిండిపోయి రోడ్లపైకి వచ్చే మురుగునీరుతో నరకం అనుభవిస్తున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ గ్రామంలో చూసినట్లయితే వీధి దీపాలు వెలగక పోవడంతో రాత్రి సమయంలో విషపూరితమైన జీవులు రోడ్లపైకి వచ్చి చాలామందిని గాయపరస్తుండటంతో భయం గుప్పిట్లో గడుపుతున్నామని ప్రజలు వాపోతున్నారు.అలాగే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులు సరిగ్గా లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవా కార్యక్రమాలు జరుపుకునే ముందు ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా గ్రామ సర్పంచ్,నాయకులు, పంచాయతీ కార్యదర్శి,మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా గ్రామ అభివృద్ధిని కుంటి పడకుండా ముందుకు నడిపించాలని స్థానిక ప్రజల కోరుచున్నారు.ఇప్పటికైనా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ గా ఉన్న పెంటపాడు గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈ గ్రామం పై ఎప్పటికప్పుడు నాయకులతో అధికారులతో సమీక్ష నిర్వహించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.