బహుజన రాజ్యం తోనే బతుకులు మారుతాయి

బి ఎస్ పి. రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్.
హైదరాబాద్ ఆగస్టు 25 నిజం న్యూస్
నేను ఎప్పుడో చెప్పా ప్రస్తుత ప్రభుత్వానికి సందర్శించడం తప్ప సమస్యలల్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేదని. చచ్చేది అణగారిన వర్గాల పిల్లలు, బాధ అనుభవించేది మన పిల్లలు 8 ఏళ్ళల్లో అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉందో పలకరించనోడు పిల్లలు చస్తే కనికరిస్తాడా, అని బి ఎస్ పి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్, ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు విద్యార్థుల సమస్యలు సిల్లీ అన్న అజ్ఞాని సబితా ఇంద్రారెడ్డి గారు మరి నేడు ఒక విద్యార్థి తన జీవితాన్ని కోల్పోవడం కూడా సిల్లీ ఏ నా…?
మొత్తం ప్రభుత్వం సిగ్గుపడాలి, అయినా 1200 కోట్లు పెట్టి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నిర్మించే బదులు గురుకులాకి ఒక డాక్టర్ ని నియమించిన ఈ రోజు ఆ అబ్బాయి ప్రాణాలు మిగిలేవి.వేల మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఆరోగ్యానికి సంబంధించిన అంశాల మీద ద్రుష్టి సారించకపోవడం నిజంగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం తప్పా మరొకటి కాదు అని అన్నారు.
గుర్తుంచుకోండి మిత్రులారా ఈ చావులు, ఈ బాధలు 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా మనం వాళ్లనే అధికారంలో కూర్చోబెడుతున్నాం అంటే తప్పు మన వైపు కూడా ఉంది ప్రజలు, ప్రజలకొరకు పని చేసే ప్రభుత్వాలని ఎన్నుకోవాలి కాని, ఒక వర్గ ప్రయోజనాల కోసం, ఒక కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలని ఎన్నుకుంటే ఇలాగే ఉంటది. కేవలం బహుజన రాజ్యంలో మాత్రమే మన పేదవారి బ్రతుకులు మారుతాయిఅనేవిషయంగుర్తుంచు కోవాలని హితవు పలికారు…