అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి, ఆగస్ట్ 25 నిజం న్యూస్

హైదరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శాలిగౌరారం మండలం రామానుజపురం గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.

నూతనంగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు.