ఈ రహదారికి మోక్షం ఎన్నడో..!

*ఏళ్లు గడిచినా మరమ్మతులకు నోచుకోని రహదారి…
* బిటి రోడ్డు గ్రావెల్ రోడ్డు గా మారుతున్న వైనం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
చర్ల ఆగస్టు 25 (నిజం న్యూస్) మండల కేంద్రంలోని తేగడ నుండి గొమ్ముగూడెం వరకు 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద 2.200 కి.మీటర్ల పొడవు సుమారు1. కోటి రూపాయల నిధులతో రోడ్డు మంజూరు చేసింది తేగడ. మేడి వాయి కాలనీ. మేడివాయ. గొమ్ముగూడెం. సి సి. బి టి. నిర్మాణం పనులు చేపట్టారు రోడ్డు నిర్మించి పదిహేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు మరమ్మత్తులకు నోస్కోలేదు రైతు వారి గ్రామాలు కావడంతో నిత్యం వ్యవసాయ పనుల సీజన్లో వర్షాకాలం దమ్ము చక్రాల తో ట్రాక్టర్లు. కూలీ ల ను తరలించే వాహనాలు రద్దీ ఎక్కువగా ఉండటంతో వర్షాల కారణంగా వరదలకు రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి పూర్తిగా పాడైపోయింది వీటి రోడ్డు కాస్త గ్రామాలు రోడ్డుగా మారింది ఏళ్లు గడిచినా ఇప్పటివరకు మరమ్మత్తులకు పోలేదు. నిత్యం నాలుగు గ్రామాల ప్రజలు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వాహనదారులు ఆ రోడ్డు పైనే వెళ్లాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ రోడ్డుపై తిరుగుతున్న నిమ్మకు నీరు తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయ నాయకులు ఓట్ల కోసం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారని గ్రామాల అభివృద్ధి కోసం పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది ఏళ్లు కావస్తున్న అభివృద్ధి శూన్యమని ప్రజలు పెదవిరుస్తున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం. నాయకులు గ్రామాల అభివృద్ధియే ధ్యేయమని గొప్పలు చెప్పడం తప్ప అభివృద్ధి శూన్యమని ప్రజలు పెదవిరుస్తున్నారు ఈ విషయమై గ్రామస్తులు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రం అందజేయటం జరిగిందని గ్రామస్తులు తెలిపారు 2020లో మరమ్మత్తులకు నిధులు మంజూరయ్యాయని కరోనా సమయం కావడంతో పనులు చేపట్టలేకపోయామని అధికారులు తెలిపారని గ్రామస్తులు తెలిపారు రెండవసారి పి ఆర్ డి ఈ. ఏ ఈ లకు దరఖాస్తు ఇచ్చిన ప్రయోజనం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి తేగడ నుండి గొమ్ముగూడెం వరకు రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు