రాజా సింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి.
సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 24 నిజం న్యూస్.
రాజా సింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు…
సూర్యపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు…
తెలంగాణలో బీజేపీ నాయకుల కుట్రల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉన్నదని,రాజా సింగ్ తో మాట్లాడించిందే కేంద్ర నాయకులు అని,మళ్ళి సస్పెండ్ చేసినట్లు డ్రామా అడుతున్నారని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు…
బీజేపీ క్రమ క్రమంగా తన వికృత రూపాన్ని తెలంగాణాలో బయట పెడుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ నాయకుల లక్ష్యం అని అన్నారు..
తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి,రాజకీయ లబ్ది పొందటమే బీజేపీ నాయకుల లక్ష్యం అని అన్నారు…బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణాలో నడవదని మంత్రి అన్నారు…
బీజేపీ నాయకులు చట్ట సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు..
ఏ దర్యాప్తు సంస్థ చెప్పిందని లిక్కర్ స్కాం గురుంచి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని,ఢిల్లీ లో ఎంపీ ఆరోపిస్తే ఇక్కడ దాడులు చేస్తున్నారని ఇలాంటి సంస్కృతిని తెలంగాణ ప్రజలు సహించరని మంత్రి అన్నారు.