పూర్వ విద్యార్థుల కలయిక- పాఠశాలకు కొండంత అండ

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి లో పాలుపంచుకున్న అన్నారం పూర్వ విద్యార్థులు.
పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం 2 లక్షల వితరణ.
పూర్వ విద్యార్థుల కృషి సహకారం పట్ల జై జై కొడుతున్నగ్రామస్తులు ,విద్యార్థులు.
తుంగతుర్తి, ఆగస్టు 24 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలకు మౌళిక వసతుల రూపకల్పన కోసం, నిధులు మంజూరు చేస్తున్నప్పటికీపూర్తిస్థాయిలో అభివృద్ధి సాగకపోవడంతో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలకు దాతలు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రేరేపించారు. దీనితో అన్నారం గ్రామానికి చెందిన 19 88- 89 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, తాము సైతం, పాట శాల అభివృద్ధిలో సై అంటూ, భాగస్వాములుగా చేరి ,పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి కంకణం బిగించి గ్రామానికి చెందిన బింగి లక్ష్మయ్య తన తోటి మిత్రులతో కలిసి మాట్లాడి, తమకు తోచిన విధంగా మొదటిసారిగా 2 లక్షల రూపాయలను, అన్నారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కోసం కల్పించారు.
సహాయ సహకారాలు అందించిన పూర్వ విద్యార్థులు అయిన మల్లిపెద్ది శ్రీనివాస్ రెడ్డి తక్షణమే లక్ష రూపాయలు ప్రకటించి 25 బెంచీల ను అందించారు. బింగి లక్ష్మయ్య 40 వేల రూపాయలతో తరగతి గదుల్లో కరెంట్ సౌకర్యం కల్పించారు. కొడకండ్ల సుధారాణి 20వేల తో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వరకు 150 స్టీల్ ప్లేట్స్ అందించారు. చామకూరి హేమలత పదివేలతో మూడు బెంచీలు, కొడకండ్ల శ్రీదేవి పదివేల రూపాయలతో అదనంగా మూడు బెంచీలు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమకు తోచిన విధంగా పాఠశాల అభివృద్ధి లో భాగస్వాములు కానున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చేయి చేయి కలిపితే ప్రభుత్వ పాఠశాలలో బలోపేతమై తాయని వారు తెలిపారు.
తాము చదువుకున్న పాఠశాలకు తిరిగి మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా పూర్వ విద్యార్థుల తీసుకున్న బలోపేతమై నిర్ణయం పట్ల అన్నారం గ్రామానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదువుకున్న పాఠశాలకు, సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది.
మల్లిపెద్ది. శ్రీనివాస్ రెడ్డి (అన్నారం)
నాగారం గ్రామంలో పుట్టి, పాఠశాలలో చదివి, పాఠశాలకు తన వంతు సహాయంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆనందంగాతెలియజేశాడు.
పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర వెలకట్టలేనిది.
బింగి. లక్ష్మయ్య (అన్నారం)
పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకొని లక్ష్యంతో తన తోటి స్నేహితులతో మౌలిక వసతులు కల్పించాలని అడగగానే సహాయ సహకారాలు అందించిన ప్రతి మిత్రునికి అభినందనలు తెలిపారు. పాఠశాలలో చదువుకున్న ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.