రోడ్లమీదనే మూగజీవాలు- ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

-నేరేడుచర్ల లో పట్టించుకోని మున్సిపాలిటీ

– వదిలేసిన పోలీస్ వ్యవస్థ

నేరేడుచర్ల ఆగస్టు 23 నిజం న్యూస్: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా కొంతమంది ప్రజలు వారి ఆవులను, గేదెలను ఈవినింగ్ టైం లో వదిలి పెట్టడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది, వాహనదారులకు  ఇబ్బందిగా మారింది.

 

రోడ్డుకు అడ్డంగా పడుకుని, అటు ఇటు తిరుగుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న  మున్సిపాలిటీ , పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజలు, ప్రయాణికులు దయచేసి ఈ సమస్యకు పరిష్కార  మార్గం చూపండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. ఆవుల యజమానులు నేరేడుచర్ల లో ఉన్నా కూడా వారికి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం.

పశువులు రోడ్లపై తిరుగుతూ ఉండటం వలన ఇప్పటికే  పలువురు వాహనదారులు ప్రమాదాలను బారిన పడ్డారు. ఈ సమస్యను అరికట్టకపోతే ఇంకా మరిన్ని రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.

ఇప్పటికైనా స్పందించి అధికారులు మున్సిపాలిటీ వారు వాటిని రోడ్డుమీదికి రాకుండా చూడగలరని ప్రజలు కోరుతున్నారు.