పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే నా లక్ష్యం: డాక్టర్ విజయకుమార్

-ఘనంగా విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం…..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 23 (నిజం న్యూస్) విశ్వాస్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ సోమవారం విద్యానగర్ కాలనీ లో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని లక్ష్యంతో, చికిత్స కోసం హాస్పిటల్ కి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వైద్య పరీక్షలతో, అతి తక్కువ ఖర్చుతో, ధనిక,నిరుపేదలు అని తేడా లేకుండా అందరికీ ఒకటే అయినటువంటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు.
అందులో భాగంగా హాస్పిటల్ లో అందించే సేవలను వివరించారు.అపెండెక్స్ 24 గంటలు సర్వీస్, హెర్నియా, పేగు జారుట, హైడ్రోసిల్ బుడ్డ, హిమ రాయిడ్స్ ఫైల్స్, మూలలు ఫిస్టులా, ఫిషర్,ప్రేగు మడతపడుట, డయాబెటిక్, పుట్ కనుతులు సిస్ట్ లు, ఆనేలు, స్క్రీన్ గ్రాఫ్టింగ్,థైరాయిడ్, కాలిన గాయాలు, సెల్యూట్ లైటిస్,కిలాయిడ్, కూతలు, చీము గడ్డలు, పులిపిరులు, కత్తి పోటు, యాక్సిడెంట్, కేసులు కేసులు 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహించబడుతాయని విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ (ఎంబిబిఎస్ ఎమ్ ఎస్ జనరల్ సర్జన్) తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు,ఎంపిపి బాదవత్ శాంతి, విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ చైర్మన్ DR. విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపీటీసీలు భూక్యా రుక్మిణి, కౌన్సిలర్లు మోరే రూప,వనచర్ల విమల,కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్,టిఆర్ఎస్ నాయకులు ఎమ్ ఏ రజాక్,బిక్కసాని నాగేశ్వరరావు, టీబీజీకేఎస్ రజాక్,యూసుఫ్, టిఆర్ఎస్వి అధ్యక్షులు అనుదీప్, భాస్కర్ మొరే, మండల ప్రధాన కార్యదర్శి బొమ్మిడి శ్రీకాంత్, సత్యనారాయణ (సంపు), పెయింటర్ రాజేష్, పోకల నగేష్, మండల యూత్ అధ్యక్షులు కన్నె, హీరలాల్, కుమారస్వామి, కుమారస్వామి, గంగాధర్, బాచి, కయుం, 22 వార్డ్ యాకూబ్, జానీ,అశోక్, శివ, మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యజమాన్యం కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.