కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరికలు

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీష్ రెడ్డి.
నల్లగొండ ఆగస్ట్ 23 నిజం న్యూస్
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ మెంబర్ ఎండి యాకూబ్ , వార్డు మెంబర్ గైరా యాదయ్య రాజుపేట తండా గ్రామ వార్డు మెంబర్లు ఆలే శారద అయ్యప్ప రామావత్ లక్ష్మణ్ నాయక్ తో సహా పలువురు, టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు