కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన గాంధీ వైద్యులు

గాంధీ వైద్యుల సాహసానికి పేద ప్రజల అభినందనలు

ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశం తోనే గాంధీలో ఉచిత సర్జరీ.

పేద కుటుంబానికి 15 లక్షల ఆదా.

హైదరాబాద్, ఆగస్టు 23 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో, తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి, మూడేళ్ల చిన్నారి వినికిడిలోపాన్ని సరిదిద్దిన, గాంధీ వైద్య బృందానికి అభినందనలు. ప్రైవేటులో దాదాపు రూ.15 లక్షల దాకా ఖర్చయ్యే ఈ చికిత్స సీఎం కేసీ ఆర్ దిశ, నిర్దేశనంలో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ,మేధావులు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.