Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజగోపాల్ రెడ్డి ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,ఎమ్మెల్యే డాక్టర్ కిషోర్ కుమార్.

హైదరాబాద్ ఆగస్టు 22 నిజం న్యూస్

దేశం మునుగోడు వైపు చూస్తున్న సందర్భమిద నీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సోమవారం హైదరాబాదులో సమావేశంలో మాట్లాడారు.

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆత్మ గౌరవాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారు అని అన్నారు.

…కాంట్రాక్టు ల కోసం బీజేపీ లో చేరారు

.అవసరం లేకున్నా అనివార్యంగా జరుగుతున్న ఉపఎన్నిక ఇది.

…సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే ఆయనను అడ్డుకునేందుకు బీజేపీ తెచ్చిన ఉపఎన్నిక ఇది అని విమర్శించారు.

…కేసీఆర్ అభివృద్ధి పై వాస్తవాలు చెబితే అమిత్ షా నిన్నటి మీటింగ్ లో అన్ని అబద్ధాలే చెప్పారు.

..అమిత్ షా కు స్క్రిప్ట్ రాసిచ్చిన వారికి అవగాహన లేదు.

..ఉమ్మడి నల్లగొండ జిల్లా లో మెడికల్ కళాశాలలు లేవని అమిత్ షా కు ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు.

…కేసీఆర్ ను బద్నాం చేసేందుకు తెలంగాణ లో కరెంటు సమస్య తెచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.

…జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురే స్తుంటే సెప్టెంబర్ 17 నాడు ఎగురియాల్సిన అవసరం ఏమిటీ

…తాడిపార్ అమిత్ షా చెప్పులు మోస్తున్న తాంబాకు సంజయ్ అని అన్నారు.

…దళితుల పై అత్యాచారాలు చేసే నేతలు ఎక్కువున్న బీజేపీ అమిత్ షా దళితుల గురించి మాట్లాడటమా

…మతోన్మాదమే బీజేపీ ఎజెండా తప్ప ఇంకొకటి లేదు.

..కేసీఆర్ ను మించిన దళితుడు ఎవ్వరూ లేరు.

..2018 ఎన్నికల మేనిఫెస్టో లో దళిత ముఖ్యమంత్రి హామీ మేము ఇవ్వలేదు

…కేసీఆర్ అయితేనే తెచ్చుకున్న తెలంగాణ బాగుపడుతుందని సీఎం గా చేసుకున్నాం..

…రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తమ గ్రామాలను తెలంగాణ లో కలపాలని డిమాండ్ చేశారంటే అమిత్ షా కు కేసీఆర్ మీద మాట్లాడేందుకు సిగ్గుండాలి

…చరిత్రను వక్రీకరించే ప్రయత్నం అమిత్ షా చేస్తున్నారు

..ఇకనైనా చరిత్ర తెలుసుకుని అమిత్ షా మాట్లాడాలి

…మునుగోడు లో ఎగురేది గులాబీ జెండానే.. రెండో స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీ లు కొట్లాడుతున్నాయ్

…దళితులకు బీజేపీ ఒక్క పథకమైనా తెచ్చిందా

…మా ఎమ్మెల్సీ కవిత నిఖార్సయిన ఉద్యమ కారిణి, అని కొనియాడారు.

…కవిత మీద కావాలనే ఆరోపణలు చేస్తూ బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోంది బిజెపి పార్టీయేనని అన్నారు

…ఎమ్మెల్సీ కవిత తన మీద వచ్చిన ఆరోపణలపై ధీటుగా స్పందించింది.

.పరువు నష్టం దావా వేస్తానని కూడా చెప్పారు. బిజెపి తాటాకు చప్పుళ్లకు టిఆర్ఎస్ పార్టీ భయపడడ దాని అన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నోముల భరత్ నల్లమోతు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.