నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్,ఆగస్ట్21(నిజం న్యూస్):

నిజామాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి కంట తడి పెట్టించే ఓ విషాదం చోటుచేసుకుంది.కుటుంబసభ్యుల్లోని ఒకరు కంటికి కనిపించని కానరాని లోకాలకు వెళ్ళిపోతేనే తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉంటామన్నది అందరికి తెలిసిందే,ప్రస్తుత పరిస్థితిని చూస్తే,చూసిన ప్రతి ఒక్కరు తట్టుకోలేని ఘటన నిజామాబాదులో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే,ఓకే కుటుంబానికి చెందిన నలుగురు నగరంలోని కపిల హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు.ఆదిలాబాదుకు చెందిన సూర్య ప్రకాష్ గత 15 రోజులుగా జిల్లాలోని కపీల హోటల్లో ఓ గదిని తీసుకొని కుటుంబంతో కలిసి ఉంటున్నారు.అయితే వాళ్ళు తీసుకున్న రూం నంబర్ 101 లోనే ప్రకాష్ ఉరి వేసుకుని చనిపోగా బార్య అక్షయ కూతురు ప్రత్యూష (13) కొడుకు అధ్వైత్ (7) విషం తాగి మృతి చెందారు. అదిలాబాదులో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆత్మహత్యకు గల కారణాలు,రియల్ ఎస్టేట్ లావాదేవీలే ఉండచ్చనే దిశలో పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే ఒకరకంగా ఈ కుటుంబం ఆత్మహత్యకు సందీప్,నారాయణ మరో వ్యక్తి, తీవ్రమైన వేధింపులే కారణమని తెలుస్తుంది.పోలీసులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబం వద్ద దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా 306 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.