సీసీటీవీ కే చిక్కని సిసి లు ?

ఆదర్శ మహిళా సమాఖ్యలో ఒక్కరే సిసి ఉన్నారా..మిగిలిన ముగ్గురు సీసీలు ఎక్కడ..?
– చుట్టపుచూపుగా.. సమయపాలన పాటించని సీసీలు
– స్థానికంగా ఉన్న సీసీ పైనే పని భారం
నర్సింహులపేట ఆగస్టు22(నిజంన్యూస్) :ఆ కార్యాలయంలో అన్ని తానై, మిగిలిన వారి పని కూడా చేయిస్తూ, స్థానికంగా ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటాడు. మహిళా సంఘ సభ్యులకు లోన్ ల విషయంలో, ఇతర కార్యక్రమాల విషయంలో ముందుండి ప్రముఖ పాత్ర వహిస్తాడు. అతనే సిసి గూగులోతు భీముడు. ఆ కార్యాలయమే ఆదర్శ మహిళా మండల సమాఖ్య నర్సింహులపేట కార్యాలయం. మిగిలిన ముగ్గురు సీసీలు సమయపాలన పాటించకుండా, కొంతమంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియక పోవడం గమనార్హం. చుట్టపుచూపులా కార్యాలయానికి వస్తున్నా, సీసీలు అంటేనే ఎవరో తెలియని పరిస్థితి మండలంలో నెలకొని ఉంది. స్వయాన మహిళా సంఘ సభ్యులే చెప్పడం గమనార్హం. నెల నెలకు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులే సమయపాలన పాటించకుంటే, మహిళా సంఘ సభ్యులకు సేవ చేయకుండా, పలు కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ముగ్గురు సీసీలు ఎప్పుడు, ఏ సమయంలో ఎక్కడ ఉంటారో.? ఎప్పుడు వస్తారో.! కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికే తెలియక పోవడం గమనార్హం. ఇటీవల నర్సింహులపేట మండలానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య సందర్శించినప్పుడు ఆ సీసీ లపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మండల సమాఖ్య లో పనిచేస్తున్న ఈ ముగ్గురు సి సి ల పై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా సంఘ సభ్యులు, మండల ప్రజలు కోరుతున్నారు.