మూడు రోజులుగా బియ్యం కోసం నిరీక్షణ

– సమాధానం దాటవేస్తూ కాలయాపన చేస్తున్న డీలర్ దేవయ్య
నర్సింహులపేట ఆగస్టు22 (నిజంన్యూస్) :
మండలంలోని వంతడుపుల గ్రామం డీలర్ దేవయ్య రేషన్ షాప్ లో సుమారు వందమంది కూలీలు బియ్యం కోసం నిరీక్షణ చేస్తున్నారు. ఇదేమిటని ప్రజలు ప్రశ్నిస్తే, సిగ్నల్స్ పనిచేయటం లేదని, సమాధానం దాటవేస్తూ కాలయాపన చేస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే బియ్యం కోసం పడిగాపులు ఉండి ఇంటికి వెనుదిరిగి వెళ్లారు. రోజుకు సుమారుగా 50 నుంచి 100 మంది లబ్ధిదారులను పడిగాపులు పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కావాలనే డీలర్ కాలయాపన చేస్తున్నట్లు, అతని పై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేసి బియ్యం పంపిణీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.