స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

21 వేల నగదును కుటుంబ సభ్యులకు అందజేతదేవరుప్పుల,ఆగస్టు 21,నిజం న్యూస్:

ఇటీవల వారం రోజుల క్రితం నిర్మల గ్రామానికి చెందిన ఎండీ ముజఫర్ బైక్ యాక్సిడెంట్ లో మరణించగా బాధిత కుటుంబాన్ని 2000 సంవత్సరంలో మూజఫర్ తోకలసి పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి స్నేహితుని కుటుంబానికి అండగా మేముంటామంటు మెడ పూర్ణచందర్,ఎన్నం సోమరాజు,సింగారపు అశోక్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ముజఫర్ బార్య హసినాకు 21000 వేల నగదు ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని బంధాలకన్నా స్నేహబంధం గొప్పదని స్నేహితుడు ఆపదలో ఉంటే ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని వారన్నారు.తమ స్నేహితుని కుటుంబానికి భవిష్యత్తులో కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాడబోయిన రవి,ఎడమ సంతోష్,మేడ పెద్దపూర్ణ,ఎడ్ల శ్రవణ్ కుమార్,సంజీవ,కుమార్,బిక్షపతి తదితరులు ఆర్థిక సాయం అందించిన వారిలో ఉన్నారు.