శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఆగస్ట్ 21(నిజం న్యూస్)
ఆలేరు పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ బండిరాజుల శంకర్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి జీవన విధానాన్ని, జీవన లక్ష్యాలను తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మను జన్మదినం రోజున ఆరాధించినట్లైతే సకల శుభాలు కలుగుతాయని ఆయన అన్నారు.శ్రీ కృష్ణ పరమాత్మ స్వయంగా ప్రబోధించిన “భగవద్గీత” ప్రపంచ మానవాళికి నేటికీ దివ్య సందేశాన్నిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు గోపికలు, గోపాలురుగా, రాధాకృష్ణులుగా వేషధారులై చేసిన నృత్యాలు పలువురి ప్రశంసలందుకున్నాయి. విద్యార్థులందరికి ప్రిన్సిపాల్ బహుమతులందజేసారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయమ్మ, భిక్షపతి, పరమేశ్వరి, వాణిశ్రీ, ప్రసన్న లక్ష్మి, అన్నపూర్ణ, సిద్ధులు, స్వరూప, శ్రీధర్, భీమేశ్, శంకర్, సరస్వతి, కవిత, పావని, దీప్తి, లావణ్య, విశ్వద మరియు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.