రాజకీయ ఉద్యోగం చేస్తున్న రౌడుర్ వీఆర్వో !

-కోర్టు ఉత్తర్వుల ధిక్కారం
-ఆర్వో ఆర్ అడంగల్లో పేర్లు తొలగిస్తానంటూ బెదిరింపులు
-తహసీల్దార్ మాట లెక్క చేయని వైనం
కౌతాళం ఆగస్టు 20 నిజం న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోనీ కొందరి ప్రభుత్వ ఉద్యోగుల తీరు తాము పాడిందే పాటగా ఆడింది ఆటగా మారింది న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉన్నా యదేచ్ఛగా ఆర్ఓఆర్ అడంగళ్లలో పేర్లను మార్చి రాజకీయ నాయకుల ముందు భక్తిని చాటుకుంటున్నారు వివరాల్లోకి వెళితే కౌతాళం మండలం రౌడూరు గ్రామ రెవెన్యూ అధికారి పంపాపతి ఓ కేసు కోర్టులో పెండింగ్ ఉండగా పేర్లను మార్చేందుకు వారి సంతకాల కోసం రైతులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన రైతుపై నాయకులతో భౌతిక దాడులు చేయిస్తానని హెచ్చరిస్తున్నాడు అధికారులు ఈ వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.