స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం

వెంకటేష్ అంతిమయాత్రలో పాల్గొన్న స్నేహితులు, అశేష గానుగుబండ గ్రామస్తులు.
తుంగతుర్తి ఆగస్టు 20 నిజం న్యూస్
మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన జటంగి వెంకటేష్(20) రాజకీయ నాయకుడు కాదు… ఓ పెద్ద భూస్వామి కాదు… కానీ. చిన్నతనం నుండే. పది మందితో మంచితనము తో కలుపుకు పోయే గుణం ఉన్న…. ఎంతోమంది స్నేహితులను కలిగిన… మనసున్న మారాజు గా చెప్పవచ్చు..
కానీ మాయ రోగం తో గత కొన్ని రోజులుగా అన రోగ్యానికి గురై, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీనితో గానుగుబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం మృతదేహాన్ని తోటి స్నేహితులు ట్రాక్టర్ పై ఉంచి, ముందుగా వెంకటేష్ ఫ్లెక్సీ కట్టి… వినూత్న రీతిలో మొదటిసారిగా ఆయన చిత్రపటానికి స్నేహితులందరూ … స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నట్లుగా… పాలాభిషేకం చేసుకుంటూ స్మశాన వాటిక కు, తీసుకొని వెళ్లారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి అశేష ప్రజలు అంతిమయాత్రలో పాల్గొనడం గమనార్హం.. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నతనం నుండే స్నేహితులంటే స్నేహితుల మధ్య తిరుగుతూ వెంకటేష్ అభిమానాన్ని చూరగొన్నాడు . కుటుంబ సభ్యులు కన్నీరు పర్వత మయ్యారు