ఐదు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన సురక్ష ఆసుపత్రి

ఐదు నెలల గర్భిణికి అబార్షన్
*కాసులకు కక్కుర్తిపడి అబార్షన్ చేసిన సురక్ష హాస్పిటల్*
*వంచకుడు పరార్… శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ఆదివాసీ సంఘాలు*
ములకలపల్లి ఆగస్టు 19 (నిజం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సురక్ష హాస్పిటల్లో దారుణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసి ఒక గిరిజన యువతి ప్రాణాలు హరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటనపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ములకలపల్లి మండలం వి.కే ..రామవరం గ్రామానికి, చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ అమ్మాయిని ట్రాప్ చేసి గర్భవతిని చేశాడో ప్రభుద్దుడు. పూసుగూడెం గ్రామానికి చెందిన భూక్య నందా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ములకలపల్లి మండలం వి.కే ..రామవరం గ్రామానికి, చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ అమ్మాయిని ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు. ఇప్పటికే ఆ అమ్మాయి ఐదు నెలల గర్భవతి కావడంతో భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో అబార్షన్ చేయించడానికి జాయిన్ చేసిన వంచకుడు. డబ్బుకు ఆశపడిన ఆసుపత్రి యాజమాన్యం పెళ్ళికాని యువతికి అబార్షన్ చేశారు. అయితే ఆబార్షన్ వికటించి రక్తస్రావంతో అమ్మాయి తనువు చాలించింది. కాగా గిరిజన యువతి మరణానికి కారణమైన ఆ వంచకుడు పరారయ్యాడు. అమ్మాయి తల్లిదండ్రులకు హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఆదివాసి సంఘాలు అక్కడ చేరుకొన్నారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.