నీళ్లు కూడా తాగే హక్కు లేని దేశంలో స్వాతంత్య్ర వేడుకల్లో గర్వంగా ఎట్లా పాల్గొంటాం

నేరేడుచర్ల, ఆగష్ట్ 19(నిజం న్యూస్ )
రాజస్థాన్ లో కుల రక్కసికి బలైపోయిన దళిత చిన్నారి ఇంద్ర కుమార్ మేఘావల్ కి నివాళులు మాకు నీళ్లు కూడా తాగే హక్కు లేని దేశంలో స్వాతంత్య్ర వేడుకల్లో గర్వంగా ఎట్లా పాల్గొంటాం నేరేడుచర్ల లో రాజస్థాన్ లో కుల రక్కసికి బలైపోయిన దళిత చిన్నారి ఇంద్ర కుమార్ మేఘావల్ చిత్రపటానికి పూలమాలలు వేసి బి ఎస్ పి నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతం అంటరానితనాన్ని నిర్మూలించలేకపోయింది.
దళితుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో దళితులు స్వాతంత్ర ఉత్సవాల్లో వజ్రోత్సవ వేడుకల్లో ఘనంగా ఎట్లా పాల్గొనగలుగుతారు.
రాజస్థాన్లో మూడో తరగతి చదువుతున్న 9 సంవత్సరాల దళిత చిన్నారి ఇంద్ర కుమార్ మేఘవల్ ని నీళ్ల కుండను తాకడానే నెపంతో టీచర్ కొట్టి చంపడం అమానుషం.25 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన ఇంద్రకుమార్ మేఘావల్ మరణం దళితుల హృదయాలను కలిసి వేసింది.ఈ సమస్య ప్రధాన దృష్టికి వచ్చిన కూడా స్పందించకుండా ఈ సంఘటనను కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది.స్వాతంత్ర పోరాటంలో దళితుల పాత్ర తిరుగులేనిది అందుకు ఉదాహరణ ఉద్ధం సింగ్ , అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ లు.అంటరానితనాన్ని నిర్మూలించాలనేచిత్తశుద్ధి పరిపాలకులకు లేదు.స్వాతంత్రం అందించిన స్వేచ్ఛ వాయులు పీల్చే హక్కు దళితులకు లేకుండా పోయింది.
ఇంకా ఈ దేశంలో సరిగ్గా తిండి లేని పేదలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అది బాధాకరం.
ఇట్టి కార్యక్రమం లో దక్షిణ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్ అమరావరపు అభ్రహం కె వి పి ఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్ రావు,