ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

చందుర్తి ఆగస్టు 18 (నిజం న్యూస్):
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి వేడుకలు గౌడ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా గౌడ యువసేన అధ్యక్షులు పల్లి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అన్నారు. రాజులపై తిరుగుబాటు చేసి బహుజనులకు అండగా నిలబడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు.ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తూ, ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఇందులో ఉపాధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పాలక వర్గం గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, జడ్పిటిసి నాగం కుమార్, సర్పంచ్ మ్యాకల పరిషరాములు, ఎంపీటీసీ మ్యాకల గణేష్, ఉప సర్పంచ్ గంట మల్లేశం హాజరై సర్వాయి పాపన్న గౌడ్ ఫోటోకి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారిని గౌడ యువసేన యూత్ వారు శాలువాతో సన్మానించారు….