10 క్వింటాల బియ్యం పట్టివేత

తుంగతుర్తి ఆగస్టు 18 నిజం న్యూస్

10 క్వింటాల బియ్యం పట్టివేత మండలంలోని తూర్పు గూడెంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను పట్టుకున్న ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలం పచ్చల బోడు తండాకు చెందిన గుగులోత్ సాగర్ ధరావత్ పీరు వీరిద్దరూ గ్రామస్తుల వద్ద తక్కువ ధరకు బియ్యాన్ని కొని , ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పది క్వింటాళ్లు కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తున్నారు తగు సమాచారం మేరకు ఆటో నెంబర్ టీఎస్ 07 యుబి 4600 తూర్పు గూడెం శివారులో పట్టుకున్నాము వీరిద్దరిపై కేసు నమోదు చేసి ఆటోను బియ్యాన్ని స్వాధీన చేసుకున్నాము ఎస్సై డానియల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాబర్, సతీష్ , గోపి నాయకు పాల్గొన్నారు.