తెరాస గుండాలు భాజపా కార్యకర్తలపై దాడి చేయడం దారుణం

*పాలకుర్తిలో ఎర్రబెల్లి చేసిన అభివృద్ధి శూన్యం*

-భాజపా రాష్ట్ర నాయకుడు లేక రామ్మోహన్ రెడ్డి

దేవరుప్పుల,ఆగస్టు 17,నిజం న్యూస్:

బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వెన్నులో వణుకు పుడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు లేక రామ్మోహన్ రెడ్డి అన్నారు.బుధవారం దేవరుప్పుల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు భాగాల నవీన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని విమర్శించే స్థాయి,అర్హత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి తెరాస నాయకులకు లేదని అన్నారు.భారతదేశ వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశ నలుదిశలా చాటే విధంగా జరుపుకుంటున్న తరుణంలో బండి సంజయ్ రోజున మూడో విడత మహా సంగ్రామ పాదయాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో అడుగుపెట్టి భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి అనంతరం ఏర్పాటు చేసిన సభలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతుండగా ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కా పథకం ప్రకారం తెరాస నాయకులకు కార్యకర్తలకు మద్యం తాగించి తమపై దాడికి యత్నించారని దాడిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు తలలు పలిగి చేతులు విరిగాయని ఈ నీచమైన సంస్కృతి కి మంత్రి ఎర్రబెల్లి ఒడిగట్టారని విమర్శించారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖబద్దార్ నీకు రోజులు దగ్గరపడ్డాయి సిఎం కెసిఆర్ తెరాస ప్రభుత్వానికి మరో ఆరు నెలలు మాత్రమే టైమ్ ఉందని వచ్చేది భాజపా ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.స్వాతంత్య్ర దినోత్సవం వేళ భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి చేసి ఓ నీచపు వికృత ఆనందానికి పాల్పడిన నీకు పాలకుర్తిలో తిరిగే హక్కు లేదన్నారు.భారతదేశంలో తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గం ఏమైనా పాకిస్తానా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా సభలు సమావేశాలు పెట్టుకునే అర్హత ప్రజాస్వామ్యంగా ప్రతిపక్ష పార్టీలకు లేవా ఇదేమైనా మీ ఇలాఖా నాని ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక సైనికుడిగా తయారై మీ యొక్క నీచ నికృష్టపు చేష్టలను ఎండగడతారని తెలిపారు.రానున్న రోజుల్లో మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్ జిల్లా కార్యదర్శి సోమన్న పాలకుర్తి మండల అధ్యక్షుడు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్ కొడకండ్ల మండలపార్టీ అధ్యక్షుడు పులిగిల్ల ఉపేందర్ జిల్లా అధికార ప్రతినిధి చింత సుజన్,రవి,రాజు తదితరులు పాల్గొన్నారు.