సీఐ రాజు ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ..

-సీఐ రాజుని అభినందించిన చైర్పర్సన్ సీతాలక్ష్మి……

-కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన చైర్పర్సన్, సీఐ….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 17(నిజం న్యూస్)

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం సివిల్ ఆఫీస్ ఎదురు ఉన్న గ్రౌండ్లో మంగళవారం 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం రామవరం సిఐ ఎల్. రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి సరిగ్గా 11:30 నిమిషాలకు జాతీయ గీతం పాడి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో స్థల ప్రాంగణం దేశభక్తితో మారుమూరోగిపోయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 15 రోజులపాటు ఆగస్టు 8 నుండి ఆగస్టు 22 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే ఈరోజు గీతలాపన నిర్వహించడం జరిగిందని 22 వరకు నిర్వహించే కార్యక్రమాలు అందరూ పాల్గొని జాతీయ స్ఫూర్తిని ఐక్యతను చాటి చెప్పాలని వారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలలో జాతీయ గీతాలాపన కార్యక్రమం ఒకే సమయంలో ఎక్కడ వారు అక్కడే ఉండి ముక్తకంఠంతో గీతాలాపన చేశారని వారు అన్నారు ఇంత గొప్ప కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం వేదిక అవడం గర్వించదగ్గ విషయమని వారన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ గీతాలాపన కార్యక్రమం కు క్రమశిక్షణతో వచ్చి జాతీయ గీతం పాడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్కూల్ యజమానియాలకు విద్యార్థి విద్యార్థులకు ప్రజాప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు రామవరం ఏకలవ్య స్కూల్ గురుకుల స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ పాలిటెక్నిక్ కాలేజ్ స్వర్ణ భారతి స్కూల్ తదితర స్కూళ్లకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమాల్లో టూ టౌన్ సిఐ ఎల్ రాజు, ఎస్ఐ బి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు,సిబ్బంది వీరు,సురేష్,రాజా,జైత్రం, రాములు, శీను, మంగీలాల్, సిఐ డ్రైవర్ రాజా, గన్మెన్ సర్వన్,కొత్తగూడెం మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు, టీబీజీకేఎస్ 11 మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ,పట్టణప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, రామవరం టూ టౌన్ సిఐ ఎల్ రాజు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.