రక్త దానం…. మహాదానం

తుంగతుర్తి, ఆగస్టు 18 నిజం న్యూస్

ప్రమాదాల్లో ఉన్నప్పుడు మనుషులకు కావాల్సిన సంజీవని రక్తం మణి, రక్త దానం మహాదానం డి ఎం హెచ్ ఓ కోట చలం అన్నారు. బుధ వారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో 75 వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా దవాఖాన సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు రక్తం డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి వ్యక్తి తమకు తోచిన విధంగా సహాయం చేయాలని అందులో భాగంగానే మన శరీరంలో ఉన్న రక్తాన్ని ఇతరులకు అందించడం మహాదానం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామ్ ప్రసాద్, హరిచంద్ర ప్రసాద్, డి ఐ ఓ డాక్టర్. వెంకటరమణ, నాగు నాయక్, మమత, వీణ, గాజుల సోమయ్య, యాదగిరి, ఎస్సై డానియల్ కుమార్, ఏ ఎస్ ఐ ఖాజా మొయినుద్దీన్, ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్, గుండా గాని రాములు గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, వెంకట నారాయణ గౌడ్ ,సుధాకర్ గౌడ్ ఆకారపు. భాస్కర్, బొంకురి మధు, చుక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.