ఉత్తమ సేవలను గాను పోలీస్ సేవా పథకం లను అందజేత

ఉత్తమ సేవలను గుర్తించి, పోలీస్ సేవా పథకం లను అందజేత
తుంగతుర్తి ఆగస్టు 15 నిజం న్యూస్
తుంగతుర్తి పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సేవలను గుర్తించి ఏ ఎస్ ఐ ఖాజా మొయినుద్దీన్, హెచ్ సి వెంకట నారాయణ లకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం సూర్యాపేట ఎస్పి కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆధ్వర్యంలో సేవ పథకము తో పాటు, మెడల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అంకితభావంతో పని చేసినప్పుడు గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ అవార్డులు పొందడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అవార్డు పొందడం పట్ల తుంగతుర్తి పోలీస్ సిబ్బంది, మేధావులు హర్షం వ్యక్తం చేశారు.