దళిత రైతు డబ్బులు దోచారు?

వెంపటి ఐకెపి నిర్వాహకుల దే ఇష్ట రాజ్యం.
దళిత రైతు పుల్లూరు శ్రీరాము లు ఒక లక్ష 16 వేలు డ్రా చేసిన వైనం…
లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన వైనం.
జిల్లా కలెక్టర్, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ న్యాయం చేయాలని వేడుకోలు.
తుంగతుర్తి ఆగస్టు 13 న్యూస్
ఐకేపీ నిర్వాహక సెంటర్లోని యాజమాన్యం ఇష్టారాజ్యం తో అధికారుల మమేకమై, దళిత రైతు పుల్లూరు శ్రీరాములు ధాన్యం డబ్బు లు డ్రా చేసి, దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది..
మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన పుల్లూరు శ్రీరాములు తనకున్న వ్యవసాయ భూమిలో ఆరు కాలం కష్టపడి వరి పైరు పండించి సుమారు 148 బస్తాల ధాన్యమును, ఐకేపీ సెంటర్ 2 లో మే నెలలో పోశాడు. దీంతో సంబంధిత యాజమాన్య మైన ఉమా సంఘ బంధం వారు నిర్వహించారు. ధాన్యాన్ని కాంటా పెట్టుకొని, కనీసం తన పేరుమీద ఉన్న రసీదు కూడా, ఇవ్వకుండా బొంకు తూ, జూన్ 4న లక్ష 16 వేల రూపాయల డ్రా చేసి, ఒకరిమీద మరొకరు చెప్పుకుంటూ కాలం గడుపుతూ రైతును ఆవేదన కు గురిచేశారు.
. రైతు కు బ్యాంకులో ఎకౌంటు లేనందున, కొడుకు ట్రాక్టర్ యజమాని అయిన గుండ గాని రాములు ఎకౌంట్ నెంబర్ ఇవ్వగా, ఒక లక్ష 16000 వేల రూపాయలను, ఆపరేటర్ మురళి మాయమాటలు చెప్పి రాములు అకౌంట్ నుండి, డబ్బులు బయటకు తీశారు. పై నుండి ఇంకా డబ్బులు పడలేదని తప్పించుకుంటూ వస్తున్నాడు. దీనితో కుమారులతో కలిసి నిర్వాహకు రాలు ఉమా న నిలదీయగా, డబ్బులు పడ్డాయని, మురళి మోసం చేశాడని తెలిపింది. దీంతో జరిగిన సంఘటన పెద్దమనుషుల దాక వెళ్ళింది ఎవరు ఎటువంటి సహాయం చేయకపోవడంతో బాధిత రైతు శ్రీ రాములు తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో ఐకేపీ నిర్వాహకులు లపై,, మురళి పై కేసు పెట్టారు. దీనితో ఈ సంఘటన శనివారం నాడు బయటపడింది.
దీనితోపాటు ఐకెపి 1 లో కూడా గుండ గాని రాజయ్య పోసిన దాన్యం డబ్బులు 40 వేల రూపాయలు కూడా నేటి వరకు కూడా డబ్బులు ఇవ్వక పోవడం గమనార్హం. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అధికారులు, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సహకారముతో, డబ్బులు ఇప్పించి, మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, బాధిత రైతు కుటుంబం కోరుతున్నారు.
అయ్యా …ఎమ్మెల్యే సార్…. డబ్బులు ఇప్పించండి.
దళిత రైతు పుల్లూరు శ్రీరాములు వెంపటి.
గడిచిన రెండు నెలలుగా అకౌంట్ లో పడిన లక్ష 16 వేల రూపాయల డబ్బులను ఐకేపీ కంప్యూటర్ ఆపరేటర్ ఇరుగు మురళి డబ్బులు డ్రా చేశాడు. తిరిగి నా డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాను.