పర్యావరణ ప్రేమికుడికి సైకిల్ ఇప్పించిన పాత్రికేయుడు పాషా

ప్రతిరోజు నాలుగు కిలోమీటర్లు సైకిల్ నడిపితే సర్వ రోగాలు మాయం, సంపూర్ణారోగ్యం అంటున్న చార్లెస్.

సైకిల్ నడపడంతో పర్యావరణం రక్షించబడుతుంది.

హైదరాబాద్ ఆగస్టు 13 నిజం న్యూస్

పర్యావరణ ప్రేమికుడు తమిళనాడుకు చెందిన అంబు చార్లెస్ కు శుక్రవారం ఆలేరుకు చెందిన సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఖుర్షీద్ పాషా దాతల సహకారంతో సైకిల్ అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా చార్లెస్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా 20 రాష్ట్రాలలో సైకిల్ యాత్ర చేస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం,ప్రజలకు అవగాహన కల్పిస్తూన్నారన్నారు.గత రెండు రోజుల క్రితం ఖాజీపేట లో తన సైకిల్ ను ఎవరో దొంగిలిం చా ర న్నారు .దీనితో కాలిబాట న ఆలేరు కు చేరుకున్న నన్నారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడగలుగుతేనే మానవ మనుగడ ఆనందంగా ఉంటుందని అన్నారు .ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సైకిల్ పై నాలుగు కిలోమీటర్లు నడిపించగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు అన్నారు .సైకిల్ని అందించి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సాయం చేసిన ఖుర్షీద్ పాషాకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలేరుకు చెందిన పాత్రికేయులు,ఎండీ బాబా, మహేందర్, శ్రీకాంత్ ,సిద్ధులు కౌన్సిలర్లు సంగు భూపతి, రమణారెడ్డి , బొందుగుల మాజీ సర్పంచ్ జూలుకుంట్ల రాంగోపాల్ రెడ్డి ,రమేష్ తదితరులున్నారు.