Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అద్వాన్నంగా మారినా ఏలూరు టౌన్‌ప్లానింగ్‌

➡️నిబంధనలకు తిలోదకాలు

పట్టించుకోని ఉన్నతాదికారులు

ఆన్లైన్ విధానంతో కాసుల పంట

ముడుపులే కారణమంటున్నరు.

➡️పట్టణాలు క్రమబద్ధంగా నిర్మితమై ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించేందుకు,రహదార్లు,కాల్వలు,స్థానిక అవసరాన్ని భట్టి ఎప్పటికప్పుడు నిర్మాణాలు చేపట్టేందుకు గాను పర్యవేక్షణ నిమిత్తం టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

➡️క్షేత్రస్థాయికి వస్తే ఈ నిబంధనలు అడ్డుపెట్టుకొని సిబ్బంది యధేచ్ఛగా ముడుపులు దండుకుంటున్నరని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

➡️అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందికరంగాను,రహదారులు, కాల్వలను సైతం ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతుండడంతో క్రమ బద్దమైన పట్టణీకరణ సాధ్యం కాకపోగా,ఈ వ్యవస్థ ఏర్పాటే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.

➡️వాటి వివరాలలోకి వెళితే.

ఏలూరు:ఆగస్టు12( నిజం న్యూస్)

ఏలూరు నగర పాలక సంస్థలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.పలు డివిజన్‌లలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం చిన్నపిల్లాడినడిగినా చెబుతారు.వీటిని నియంత్రించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ విభాగ సిబ్బంది అందుకు విరుద్దంగా అక్రమ కట్టడాల యజమానులతో అంతర్గతంగా కుమ్మకై భారీ ఎత్తున తాయిలాలు అందుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.నగరంలో టు టౌన్లో ఇటీవల కాలంలో పరదా మాటున అక్రమాలకు బిల్డర్లు తెర తీశారు.ఆర్.ఆర్.పేటలోని ఓ బ్యాంకు ఎదురుగా పార్కింగ్ సౌకర్యం,ఇతర ప్రమాద జాగ్రత్తలేమి తీసుకోకుండా నాలుగైదు అంతస్తుల భవనాలు నిర్మాణాలు పూర్తి అయ్యాయి.వాటిని చూసి చూడనట్లుగా వ్యవహరించిన విషయంలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రామచంద్రరావు పేటలో హాస్పిటల్స్ ,మెడికల్ లాబ్స్,వస్త్ర దుకాణాలు,సెల్ ఫోన్ షాపులు, హోటల్ లకు పార్కింగ్ సదుపాయం లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏవిధంగా అనుమతులను ఇచ్చారో నగర ప్రజలు అర్ధం చేసుకోవచ్చు.నిత్యం రద్దీగా వుండే ఈ ప్రాంతంలో పార్కింగ్ సదుపాయం లేకపోవడం కారణంగా పలు దుకాణాలకు వచ్చిన కొనుగోళ్లు దారులు తమ వాహనాలను నిలిపి వుంచేందుకు నానాయాతన పడవలసివస్తుందని ఆవేదన వ్వక్తం చేస్తున్నారు, ప్రధానంగా త్రినాథ్ క్లాత్ స్టోర్స్ యాజమాన్యానికి సంబంధించి ఒకే వీధిలో అటు, ఇటూ రెండు భారీ షాపింగ్ కాంప్లెక్సులు గతంలోనే నిర్మించారు.వీటికెక్కడా పార్కింగ్ ఊసేలేదు.ఈ షాపు రోడ్డుపైనే రోజు వందల్లో మోటారు వాహనాలు నిలపడంతో రాకపోకలు కష్ట సాధ్యంగా మారాయి.స్థానిక అశోక్ నగర్,ఆర్.ఆర్. పేట,పత్తేబాథల్లో పలు అపార్ట్మెంట్లు వెలిశాయి.వాస్తవంగా బిల్డింగ్ నిర్మాణం సమయంలోనే 10శాతం స్థలం కార్పొరేషన్ కు దఖలు పరిచే విధంగా ప్లాన్ లో నిబంధనలున్నాయి.ఎక్కడైనా అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే ఆ స్థలం కార్పొరేషన్ జప్తు చేసుకోవచ్చు నని మునిసిపల్ టౌన్ ప్లానింగ్ విధివిధానాలలో ఉంది.కానీ ఆవిధంగా అధికారులు ముందడగు వేయలేక.వెనకి నుంచి మామూళ్లు మత్తులో జూగుతూ ప్రభుత్వ ఆదాయాలనికి గండి కొడుతున్నారు.వన్ టౌన్లో ఇందుకు భిన్నంగా అక్రమాలకు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తెరతీశారు.ఆన్‌లైన్ దరఖాస్తులను నిర్ణీత సమయంలో ఆమోదించాల్సి ఉండగా వివిధ వెరిఫికేషన్ల పేరుతో భవన నిర్మాణ దారుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ విభాగంలో కొందరు సంవత్సరాల తరబడి పాతుకుపోవడంతో వారు అధికారులకు భవన నిర్మాణ దారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని కార్పొరేషన్ ఉద్యోగస్తులే చెర్చించుకోవడం దుమారాన్ని తెరలేపుతుంది. దీనిపై ఇంటిలిజెన్స్ అధికారులతో నిఘా నిర్వహించి.విజిలెన్స్,టౌన్ ప్లానింగ్ ఆర్జెడీ అధికారులు ఆకస్మికంగా పరిశీలన చేస్తే పలు అక్రమాలు వెలుగులోనికి వస్తాయని పలువురు బిల్డర్లు వాపోతున్నారు.