నాచారం లోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో చైర్మన్ ఆకస్మిక తనిఖీ

-టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

హైదరాబాద్ ఆగస్టు 12 నిజం న్యూస్

బాలింతలు, పేద పిల్లల పౌష్టికాహారానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బాలామృతం ద్వారా రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లో గల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. బాలామృతం లో గల వసతులు, ఇతర విషయాలపై సిబ్బందితో రాజీవ్ సాగర్ కాసేపు ముచ్చటించారు. పౌష్టికాహారం తయారీలో నాణ్యత ప్రమాణాలు అధికారులు సిబ్బంది పాటించాలని కోరారు.