ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి
తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్.
తుంగతుర్తి ఆగస్టు 11 నిజం న్యూస్
ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో
75 వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ ఈ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టూకే ఫ్రీడమ్ రన్ లో విద్యార్థులు యువత ,ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని జాతీయ జెండాను చేతబూని ఫ్రీడం రన్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో గ్రామాల్లో ఫ్రీడమ్ రన్, 16న మండల కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉన్నందున, ప్రతి ఒక్కరు విధిగా పాల్గొని, గీతాలాపన చేయాలని కోరారు. యువత దేశభక్తి కలిగినప్పుడే, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పోలీసు శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై డానియల్ కుమార్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, మైనార్టీ ప్రిన్సిపాల్ రెడ్డి, డి సి సి బి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, తాటికొండ సీతయ్య గుండ గాని రాములు గౌడ్, కటకం వెంకటేశ్వర్లు, చెరుకు సుజనా పరమేష్, బుర్ర శ్రీనివాస్, సర్పంచులు యాకూబ్ నాయక్, ఆ న కు, గుండ గాని మహేందర్, జలంధర్, భాస్కర్, కిరణ్, మధు, యాదగిరి, బండారు దయాకర్, నారాయణ, ఈగ నాగన్న, పోలీస్ సిబ్బంది, మైనార్టీ స్కూల్ విద్యార్థులు, మేరీ మదర్ పాఠశాల విద్యార్థులు, స్థానిక యువత, ప్రజలు పాల్గొన్నారు.