కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ విషయంలో డిసిసి అధ్యక్షుని ఆమోదం తప్పనిసరి

-డిసిసి అద్యక్షలు శంకర్ నాయక్

*ఎవరి ఇష్టానుసారంగా వారు జాయినింగ్ చేసుకుంటూ పోతే అట్టి జాయినింగ్స్ చెల్లవు.*

*పార్టీకి విరుద్ధంగా జాయినింగ్ చేసుకున్న వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు*

నల్లగొండ జిల్లా ఇంచార్జి .ఆగష్టు 10.(నిజంన్యూస్): మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ విషయంలో డిసిసి అధ్యక్షుని ఆమోదం తప్పనిసరి తెలిపారు. ఎవరి ఇష్టానుసారంగా వారు జాయినింగ్ చేసుకుంటూ పోతే అట్టి జాయినింగ్స్ చెల్లవు అని తెలిపారు. గిరిజన బిడ్డను ఆయిన నన్ను అవమానపరిచే విధంగా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి మరియు సస్పెండ్ చేయడానికి సిద్ధమని తెలిపారు . కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు నియమ నిబంధనలు కట్టుబాట్లు పద్ధతులు ఉన్నాయని తెలుపుతూ పార్టీలో పెద్దలతో చర్చించి మండల బ్లాక్ కాంగ్రేస్, పార్టీ సీనియర్ల ఆమోదంతో పాటు డిసిసి అధ్యక్షుని ఆమోదం పొందిన తర్వాతనే జాయినింగ్స్ ఉంటాయి. పార్టీకి విరుద్ధంగా జాయినింగ్ చేసుకున్న వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అనవసరమైతే అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి వెనకాడనని శంకర్ నాయక్ తెలిపారు విలువలు లేని జాయినింగ్స్ చేస్తున్న వారిపైన క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి అని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తెలిపారు.

డఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, ఓబిసి సెల్ రాష్ట కో ఆర్డినేటర్ మెరుగు శ్రీనివాస్,మొల్కపట్నం ఉప సర్పంచ్ రెమడాల కర్ణాకర్,బ్లాక్ కాంగ్రేస్ ప్రదాన కార్యదర్శి పేరెళ్ళి నగేష తదితరులు పాల్గొన్నారు.