Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోటర్ సైకిల్ దొంగలు అరెస్ట్…17 బైకులు స్వాధీనం

సూర్యాపేట ప్రతినిధి ,ఆగస్టు 09, నిజం న్యూస్

ఉదయం 9 గంటల సమయంలో డియస్పి సూర్యాపేట ఆదేశాల మేరకు ఆర్. టీ.సీ బస్ స్టాండ్ వద్ద పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ జీ.రాజశేఖర్ ఆద్వర్యంలో, సబ్-ఇన్స్పెక్టర్ లు పీ.శ్రీనివాస్, ఎస్.క్రాంతికుమార్, యస్.కే.యాకూబ్, ఈ.సైదులు మరియు సిబ్బంది ఎం.అంజయ్య, జీ.కృష్ణ, జీ.కరుణాకర్, జీ. వీరయ్య, జే. సైదులు, కే.ఆనంధ్, .సీ.హెచ్ .మధు, డీ.రాజులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఏపీ-29-బీపి-1560 స్ప్లెండర్ ప్లస్ మోటార్ పై అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని ఆపి వాహన కాగితాలు అడుగగా, అతడు సరియైన సమాధానము చెప్పకుండా పారిపోవుటకు ప్రయత్నించగా, అతనిని పట్టుకొని వివరములు తెలుసుకొనగా, అతని పేరు బర్మావత్ మంగ్యా , సిద్దు తండ్రి శ్రీరాములు, వ,, 30 సం,,లు, వృత్తి: వ్యవసాయం, కూడలి తండా, మోతే మండలం అని తెలిపినాడు. అతడు మరియు అతనికి స్నేహితుడైన మున్యా నాయక్ తండా కు చెందిన ధరావత్ రమేశ్ అను ఇద్దరు కలిసి మధ్యము తాగుటకు, జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించుటకు గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి సూర్యపేట, రాచకొండ, వైజాగ్ మరియు నల్లగొండ జిల్లాలలోని వివిద చోట్ల (15) మోటార్ సైకిల్ లను దొంగిలించి వాటిని హైటెక్ బస్స్టాండ్ పార్కింగ్ ప్రక్కన గల ఖాళీ స్థలంలో దాచి సమయం చూసుకొని వాటిని అమ్ముకుందామని నిర్ణయించుకోన్నారని, అతని వద్ద పట్టుబడిన వాహనము కూడా వారు దొంగిలించినదేనని చెప్పగా, అతని వద్ద ఉన్న వాహనమును స్వాధీనపరచుకొని, బస్ స్టాండ్ వద్ద గల 14 వాహనములను స్వాధీనపరచుకొనైనది. మొత్తము 15 మోటారు సైకిల్ లను, నేరస్తుడిని పోలీసు స్టేషన్ కు తీసుకరానైనది.ఇట్టి 15 మోటారు సైకిల్ లలో

(05) మోటార్ సైకిల్ లు సూర్యపేట కు చెందినవి

(07) మోటార్ సైకిల్ లు రాచకొండ కు చెందినవి,

(02) మోటార్ సైకిల్ లు వైజాగ్ కు చెందినవి,

(01) మోటార్ సైకిల్ లు నల్లగొండ కు చెందినవి ఉన్నవి. ఇట్టి మొత్తము మోటార్ సైకిల్ ల విలువ అందాజా రూ.12,00,000/- లు ఉంటుంది.

పై వ్యక్తిని అరెస్ట్ చేయుటలో చకచక్యంగా వ్యవహరించిన పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ జీ.రాజశేఖర్ ఆద్వర్యంలో, సబ్-ఇన్స్పెక్టర్ లు, పీ.శ్రీనివాస్, ఎస్. క్రాంతికుమార్, యస్ కే.యాకూబ్, ఈ.సైదులు, క్రైమ్ సిబ్బంది ఎం.అంజయ్య, జీ.కృష్ణ, .జీ కరుణాకర్, జీ.వీరయ్య, జే. సైదులు,కే. ఆనంధ్, సీ.హెచ్.మధు, డీ.రాజు లను పట్టణ పోలీసు డి.యస్.పి ,‌పి.నాగ భూషణం గారు అభినందించారు.

నేరస్తుల వివరములు :-

1. బర్మావత్ మంగ్యా @ సిద్దు తండ్రి శ్రీరాములు, వ,, 30 సం,,లు, వృత్తి: వ్యవసాయం, కూడలి తండా, మోతే మండలం,

2. ధరావత్ రమేష్ తండ్రి చిన్న, వ,,35 సం,,లు, వృత్తి: డ్రైవరు, మున్యనాయిక్ తండా, చివ్వెంల మండలం నేరస్థుడు పరారీలో ఉన్నాడు.