చేపల వేట కోసం వెళ్లి ఇద్దరి మృతి

రఘునాథపాలెం మండలం ఆగస్టు 8 నిజం న్యూస్

రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామం రైల్వే కాలనీ నివాసులు వసువుల వీరశేఖర్ ( 30 ) సన్నాఫ్ గురవయ్య ఐలాపొంగు మహేష్ ( 25 ) సన్నాఫ్ నగేష్ వీరిద్దరూ చాపల వేట కోసం అని వెళ్లి కాలువలో పడి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం 10 గంటల సమయంలో కాలువలోకి దిగిన వీరిద్దరూ సాయంత్రం 6 గంటలైనా కనపడకపోవడంతో తల్లిదండ్రులు స్థానికులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. 8 గంటల సమయంలో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.