ఎర్ర బెండ షుగర్ పేషెంట్ల వరప్రదాయని

ఎర్ర బెండ తో ఆరోగ్యం
షుగర్ పేషెంట్లకు వరప్రదాయం.
అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది.
కొలెస్ట్రాల్ పని పడుతుంది.
ఎరువులు ,పురుగు మందులు లేవు
పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు.
బహిరంగ మార్కెట్లో మంచి గిరాకి . సాగు తో రైతుకు లాభాల పంట.
తుంగతుర్తి ఆగస్టు 9 నిజం న్యూస్.
చివ్వేల మండలం రామకోటి తండా చెందిన రైతు ధరావత్ హాని అద్భుత ప్రయోగం చేసి సాగు చేశాడు. దీనితో
ఎర్రబెండలో పోషకాల గని గా చెబుతున్నా డు..
మొదట కిలో విత్తనాలు 13 వేల రూపాయలు తీసుకొని వచ్చి నారు పోసి ఎత్తినాడు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూ ఎర్ర బెండ ను పండించాడు.
కిలో ఎర్ర బెండ కాయలు వంద రూపాయలకు సూర్యాపేట కూరగాయల మార్కెట్లో అమ్మకాలు జరుపుతూ లాభార్జన పొందుతున్నాడు.
ఎక్కడ మధ్యప్రదేశ్లో సాగు చేస్తున్న ఎర్ర బెండ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రామకోటి తండాకు చెందిన ధరావత్ హాని దంపతులు ఈ సంవత్సరం సాగు చేస్తున్నారు. ఈ మేరకు మొదటి పంటగా సోమవారం సాయంత్రం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు అమ్మకానికి తీసుకురావడంతో వెరైటీగా పచ్చబెండ పక్కన, కనబడటంతో కిలో 100 రూపాయలు చెప్పినప్పటికీ ,ప్రజలు విరివిగా కొనుగోలు చేశారు. ఎర్ర బెండ గురించి దాదాపు అన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో కథనాలు వచ్చాయి. వాటిని చూసి తాను ప్రయోగాత్మకంగా మొదటగా 10 గుంటల స్థలంలో ఎర్రబండ వేశానని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఎలాంటి పురుగు మందులు ఎరువులు వాడకుండా పండించానని రైతు ధరావత్ నాయక్ పేర్కొన్నారు.
ఎంతో విలువైన పోషకాలతో కూడిన గుండెను భద్రంగా చూసుకునే ఎర్ర బెండ ను వాడి ఆరోగ్యాన్ని పొందవచ్చని, నాకు లాభాలు చేకూరుస్తుందని రైతు ఆనందంతో చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రతి రైతు నేటి ప్రపంచంలో తనదైన రీతిలో భిన్నమైన పంటల సాగుతూనే లాభార్జన చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.