అంగడి ఇలా… నడిచేది ఎలా ??

సంతలో వ్యాపారులకు ఒక్కొక్కరికి సోమవారం 50 రూపాయలు వసూలు.

లబోదిబోమంటున్న అంగడి కు వచ్చే ప్రజలు.

తుంగతుర్తి ఆగస్టు 8 నిజం న్యూస్

గత కొంత కాలంగా వర్షం వస్తే అమరావతి మండల కేంద్రంలోని సంత లో వ్యాపారస్తులకు కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలకు ఇబ్బందిగా మారింది. గత 15 రోజుల క్రితం పెద్దపెద్ద బొందల లో నీళ్లు మురికి చేరిపోయింది. దీనితో సంతకు వచ్చే వాళ్లకు కష్టంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ కి ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నిధులు వేలం ద్వారా వస్తున్నాయి. అధికారులు రెండు మూడు ట్రాక్టర్ల మట్టి పోసి వదిలేశారు. ప్రస్తుతం ఆ బొంద లలో మట్టి పూర్తిగా నిండి కనీసం నడవలేని పరిస్థితి దాపురించింది. ఇకనైనా స్థానిక ఎంపిడిఓ, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని, సంతలో మరమ్మతులు చేయాలని వ్యాపారస్తులు, ప్రజలు కోరుతున్నారు.