ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాకతో గల్లంతైన నారాయణ మృతదేహం లభ్యం

తుంగతుర్తి ఆగస్టు 8 నిజం న్యూస్
అన్నారం బంధం లో గల్లంతైన పిట్టల నారాయణ గాలింపు కోసం ఎం డి ఆర్ ఎఫ్ టీం లోని సుమారు 20 మంది సభ్యులు ప్రత్యేకంగా రెండు బోట్ల తో రంగంలోకి దిగి సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా, ఓ చెట్టు లో మృతదేహం లభ్యమైంది. దీనితో మృతదేహం పూర్తిగా రెండు రోజులు నీటి ప్రవాహం లో ఉండడంతో. కుళ్ళి పోయినది. గత రెండు రోజులుగా స్థానిక తాసిల్దార్ రాంప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, ఎస్సై డానియల్ కుమార్, సిబ్బంది పాల్గొని చివరకు మృతదేహం లభ్యం చేకూర్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ డి ఆర్ ఎఫ్ కమాండర్ జహీర్ ఖాన్,
నితిన్ రామ్ సింగ్, సర్పంచులు సుశీల, అనుక, అనిత జనార్ధన్ ఆర్ ఐ మహమ్మద్ అలీ, ఏ ఎస్ ఐ రామ్ కోటి, కుంచాల శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు