కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ

-పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.
సైబరాబాద్, నిజం న్యూస్, (ఆగష్టు 07):
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షా దృష్ట్యా.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో 55 పరీక్ష కేంద్రాలు వద్ద నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద సీపీ పర్యవేక్షణలో డిసిపి ల నేతృత్వంలో ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు కల్పించారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 39 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
ఈ సందర్భంగా సీపీ పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పలిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బాధ్యతగా, కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణ జరగాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి సజావుగా పరీక్షల నిర్వహణ జరగాలన్నారు.
సీపీ ముందుగా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతిభా డిగ్రీ కాలేజ్, వివేకానంద డిగ్రీ కాలేజ్ లలో నిర్విహస్తున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను సిబ్బంది తో కలిసి తనిఖీ చేశారు. అనంతరం బాచుపల్లి లోని గోకరాజు రంగరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దుండిగల్ లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీ కూకట్ పల్లి లా అండ్ ఆర్డర్ ఏసీపీ చంద్రశేకర్, వెంట మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, కూకట్పల్లి ఎస్ హెచ్ఓ నర్సింగ్ రావు, కూకట్పల్లి ట్రాఫిక్ ఎస్ హెచ్ఓ బోస్ కిరణ్, డిఐ లు తదితరులు ఉన్నారు.